విగ్రహారాధన ఎందుకు చేయాలి ..?

0
1424

సనాతన హైందవ సంప్రదాయం లో విగ్రహాలను పూజించటం అనాది గా వస్తోంది.విగ్రహం అంటే నిగ్రహం కలుగ చేసేది.
విగ్రహం అంటే రాయీ లేదా లోహం తో తాయారు చేసే మూర్తి.ఈ మూర్తి అనేక రూపాలలో ఉండవచ్చు.ఇక విగ్రహారాధన విషయానికి వస్తే…ఆత్మజ్ఞానమును పొందడానికి మొదటి సాధనముగా మన ఋషులు విగ్రహారాధనను ఏర్పాటు చేసారు.
వారి వారి ఇష్టదైవములను విగ్రహ రూపం లో వున్న మూర్తులను భక్తి శ్రద్ధలతో ఆరాధించిన .వారు పరబ్రహ్మమును ఆరాదించినట్లే…
భక్తులు తమ ఇష్టదైవమైన దేవత విగ్రమును నిలుపుకొని ఆ విగ్రహమునే విశ్వాసము తో నిరంతరం పూజించిన యడల తప్పనసరిగా ఆత్మజ్ఞానం పొందగలరు.
విగ్రహారాధన వలన మనస్సు నిశ్చలమౌతుంది మనో నిగ్రహాన్ని పొంది తదుపరి నిర్గుణోపాసన ఆచరించవచ్చు.
మనోనిగ్రహం పొందకుండా నిర్గుణోపాసన ద్వార ఆత్మజ్ఞానాన్ని పొందలేరు.
పంచాగ్నానైన్ద్రియములు..పంచాకర్మేన్ద్రేయములు అంతరెంద్రేయములు..జయంచని వారు నిర్గుణోపాసనకు అర్హుడుకారు .
భక్తి శ్రద్ధలతో పరిపూర్ణవిశ్వాసమ్ తో విగ్రహారాధన చేయువారు పరబ్రహ్మమును ఆరాదించినట్లే….
విగ్రహారాధన చేయకుండానే…పరబ్రహ్మమును ఆరాధించవచ్చు..దీనినే నిర్గుణోపాసన అంటారు కాని నిర్గుణోపాసన సామాన్యులకు సాధ్యము కానిది.
ఎందువలన అంటే…?
మన ఎదుట నిలుపుకొన్న దైవ విగ్రహమీదనే..మన దృష్టిని మనస్సుని తదేకం గా నిలుపుట కష్టము చంచల స్వభావము కలిగిన మనస్సును నిశ్చలంగా ఉండునట్లు చేయుట చాలా కష్టము.
అందువలన మనస్సును విగ్రహారాధన అను ప్రక్రియలో నిశ్చలపరచి మనోనిగ్రహాన్ని పొందుట అత్యంత ముఖ్యము.
కాబట్టి మనస్సుని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని పొందుటకు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి విగ్రహారాధన అనాదిగా ప్రారంభపునాదిగా వున్నది.
సర్వవ్యాపకుడై సర్వభూతములలో చిద్రూపుడైన పరమాత్మ స్వరూపమునకు శిలా మృత్తిక కలిగిన కళ విన్యాస ప్రక్రియలను అనుసరించి విగ్రములను తయారు చేసిన దేవతామూర్తులను మంత్రములచే ఆవాహనము చేసి ప్రతిష్టించి రూపనామములతో మంత్ర విధులతో సామాన్యమైన భక్తులు ఆరాధించి భగవదనుగ్రహమును పొందుట శాస్త్రసమ్మతము.ఇదే విగ్రహారాధన అంతరార్ధము.

NO COMMENTS

LEAVE A REPLY