గోత్రం అంటే ఏమిటి ?

0
6125

గోత్రం అంటే ….
భగవంతుని ప్రత్యక్షం గా దర్శించిన మహర్షులు యజ్ఞ యాగాదులు చేసి శాంతి కాముకలై అందరి మేలు కోరేవారు
ప్రస్తుత జనులంతా ఆ మహర్షుల సంతతి వారే…ఈ ఋషి వంశం లో జన్మిస్తారో …అ ఋషి యొక్క పేరుతో వారిని పేర్కొంటూ వుంటారు దీనినే గోత్రం అంటారు.


వీరిలో భరద్వాజుడు ,ఆంగీరాసుడు,విశ్వామిత్రుడు కాశ్యపుడు,కౌండిన్యుడు,గౌతముడు ,ఆత్రేయుడు,వసిష్టుడు,యాజ్ఞవల్క్యుడు,శాండీల్యుడు,కౌన్డీల్యుడు,పరాశర,శ్రీవత్స మొదలగు మహర్షులు వున్నారు.
అంతటి మహాపురుషుల సంతానమే మనమంతా వారి పవిత్రత మనోబలం కార్యసిద్ధి మొదలగు సుగుణాలు వున్న వారి సంతానమైనందుకు ఎంతో గర్వించాలి.

భగవంతుని పూజించే సమయంలోనే కాకకుండా అన్ని విశేష సమయాలలోనూ ఆ ఋషుల పేరును
స్మరించుకుంటాము.దేవాలయములోనే సుభాకర్యాములలోను పూజలలోను వ్రతాలలోను మన గోత్రం నామాలను అడుగుతారు,ఆలయంలో పూజారులు అడుగుతారు దానిని వారు దేవుని ఎదుట చదువుతారు.పూజ సమయంలో సంకల్పం చెప్పేటప్పుడు మన గోత్ర నామాలు తప్పక తెలియ చేయవలసివుంటుంది.

ఒకే ఋషి సంతతి వారు సగొత్రికులు అవుతారు…..సగొత్రికులు సోదర సోదరిలు అవుతారు,అందువలనే వివాహ సమయాలలో వధూవరుల గోత్రము పరిశీలిస్తారు.ఒకే గోత్రమైతే వివాహం చేయరాదు వేరు వేరు గొత్రమలుఐనప్పుడె మాత్రమే బంధుత్వాన్ని కలుపుకొని వివాహం చేస్తారు.ఇచ్చట గొత్రముయొక్క ముఖ్య ఉద్దేశం.నేడు ఒకే జన్యువులు కలవారు వివాహం చెసుకొనినచో సరైన సంతానం కలుగకపొవచ్చని శాస్త్రీయంగా నిరుపితమైనది.విభిన్న జన్యువుల కలవారు వివాహం చేసుకోన్నఆరోగ్యకరమైన సంతానం కలుగకవచ్చని పరిశోధనల ద్వారా నిరూపించబడింది.పూర్వ కాలంనాటి మహర్షులు ఈ విషయాన్ని గ్రహించి వేరు వేరు వంశముల వారు మాత్రమే వివాహం చేసుకొనుటకు ఆచారం గా చేసినారు.

NO COMMENTS

LEAVE A REPLY