ధ్యానం అంటే ఏమిటి ?

0
2437

ధ్యానం మనస్సుని మరియు శరీరాన్ని శాంతపరుస్తుంది.
ధ్యానం శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తిని అందిస్తుంది.
ధ్యానం శరీరాన్నితేజస్సు తో నింపుతుంది.
కాలక్రమం లో ఆత్మజ్ఞానాన్ని క్రమక్రమముగా వికసితం చేస్తుంది.ప్రకృతి బంధాల నుంచి వీలైనంత విడిపడి స్వేచ్చ జీవితాన్ని జీవాత్మ పొందేలా ధ్యానం సహకరిస్తుంది.
నిత్యము ఆనందం పొందటం ఎలా ….
మానవుడు ఈ ఆధునిక జీవితం లో ఆనందం పొందటానికి …అనేక వ్యసనాలకు బానిస అవుతున్నాడుపరమాత్మతత్వం తెలియక తన జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటునాడు.

మనం సూర్యుని కిరణాల వంటి తెల్లని దేదీప్యమానమైన ప్రకాశం కలిగిన పరమ ప్రశాంత శాశ్వతమైన నిత్యానందం స్వతహాగా కలిగి వున్న పరమాత్మ స్వరూపులం దీనినే సత్యం నిజం విశ్వమూలకారణం దైవం అని అనేక పేర్లతో పిలుస్త్తారు.ఆత్మజ్ఞానాన్నిఉన్నత స్తాయీ లో పొందిన వారికి పైన వివరించిన ఆత్మతత్వం అనుభవం లోకి వస్తుంది.
మాయ అంటే …
పరమాత్మ స్వరూపులమైన మనం మనో దేహాలతో దీశకాలాలతొ పదార్థంతో ఐక్యమైన కారణంగా మన వాస్తవిక
స్వరూపాన్ని మరచిపోతాం అలా మరచిపోయీ ఈ లోకంలోని విషయాలతో కుస్తిపడుతుంటాం దేనినే మాయ అంటారు.అలా మాయలో చిక్కుకొని మనకంటే ఇతరం గా కనిపించే జీవులను స్వార్ధం తో నానా రకాలుగా హింసించి ఆత్మద్రోహ తత్వానికి పాల్పడి పాపులం అవుతాం ఆ పాపపలితంగానే రోగ పీడలు జీవితంలో అనేక విధాల కష్టాలను అనుభవిస్తుంటాం.ఈ నానా విధ పీడలు మనం పరమాత్మ స్వరూపులమన్న సత్యాన్ని మర్చిపోయేలా చేసి దేహమే నేనన్న స్తితికి దిగాజార్చుతాయీ ఇదే మాయ శక్తీ.ఈ మాయ శక్తిని కేవలం భగవంతుని ఆరాధన వల్ల ఈ మాయను జయించడం శులభమవుతుంది.

ధ్యానం వల్ల ఉపయోగాలు :

ధ్యానం వల్ల ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు .
ధ్యానం లో సాధన ద్వారా శారీరక రోగాలనుండి అలాగే మానసిక రోగాలనుండి రక్షణ శక్తీ పొందవచ్చు.ధ్యానం చేయటం ద్వారా మన శరిరం లోని అవసరమైన కదలికలు శరిరం లో తగ్గిపోతాయీ.మనస్సుని ఏకాగ్రం చేయటం ద్వారా మానసిక చంచలత్వం తగ్గుతుంది.అల మనోదేహాల ద్వారా అనవసరపు చర్యలు తగ్గడం వల్ల వృధాకాకుండా వున్న విద్యుత్ మయ ప్రాణశక్తి మన శరిరం లో ఎ భాగం లో సరిగాలేదో ఆ భాగాన్ని సరిచేయటం ప్రారంబిస్తుంది.అలా ధ్యానం చేస్తున్న సమయం లో శరిరం నుండి ఊర్ధ్వ ముఖంగా నిరంతరం పోయె శక్తీ శరిరం లోని కణాలను విద్యుత్ మయం చేసుకుంటు వెళుతుంది.అలాగే పరబ్రహ్మం నుండి విడుదల అయ్యే ప్రాణశక్తి అధోముఖంగా క్రిందికి ప్రవహిస్తునది ధ్యానం చేస్తున్న వారి కపాలం గుండా శరిరంలోకి తీవ్రంగా ప్రవహిస్తుంది.ఈ బ్రహ్మ శక్తీ శరీరాన్ని సత్వమయం చేయడమే కాక నానా విధాలైన రోగాలను నిర్మూలిస్తుంది.
…………………………………………….స్వస్తి…………………………………………………….

NO COMMENTS

LEAVE A REPLY