ఆలయంలోనికి వెళ్లేముందు గడపకెందుకు నమస్కరిస్తారు?

0
566

సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.
వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే…
రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.
అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.

gnanavahini-tirumala-temple

*****************************************

జ్ఞానవాహిని లో పొందుపరచే విషయాలు మీకు నచ్చితే దయచేసి షేర్ చేయగలరు

దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలను జ్ఞానవాహిని వాట్స్ యాప్ నెంబర్ కు సందేశరూపంలో తెలియచేయండి

ప్రతి రోజు ఆధ్యాత్మిక విషయాల కొరకు టెలిగ్రామ్ ,వాట్స్ యాప్  గ్రూప్ నెంబర్ :8977777599 

జ్ఞానవాహిని మెయిల్ .డి :gnanvahini9@gmail.com

*****జ్ఞానవాహిని వెబ్ సైట్ ను సందర్శించినందుకు ధన్యవాదాలు*****

                  నిరంతరం సనాతన ధర్మ సేవ లో

జ్ఞానవాహిని ఆధ్యాత్మిక సేవ సంస్థ

NO COMMENTS

LEAVE A REPLY