వేదం చదవటం ఒక న్యూసెన్స్

0
777

ఇది ఎక్కడో మారుమూల జరిగిన సంఘటన కాదు వేగంగా పాశ్చాత్య సంస్కృతీ  వైపు పరిగెడుతూ  నిత్యం ఎదో  ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూ ఆ ఊరుకి పెద్దమ్మతల్లి గ్రామదేవత ….బోనాలు ….నల్లపోచమ్మ …..తీరుమల శ్రీ వారి కల్యాణాలు ఇలా ఎన్నో జరిగే విశ్వనగరం మన హైదరాబాద్ నగరం……దాదాపు రెండు సంవత్సరాల నుంచి  32  మంది విధ్యార్ధులతో నగర శివారులోని చెనిగచర్ల లోని ఓ కాలనీలో అద్దె ఇంట్లో  బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి  గారు నడుపుతున్న వేదపాఠశాల ……నిత్యం వేదధ్వని  ప్రతిధ్వనిస్తూవుంటుంది ఆ ప్రాంతంలో …..ఉదయం 3 గంటల నుంచి వేదపఠనం మొదలౌతుంది……ఒక ఆలయం లా విరాజిల్లుతూ ఉంటుంది ఈ వేదపాఠశాల …అటువంటి వేదపాఠశాల పై విషంకక్కాడు ఆప్రాంత ప్రతినిధి ….వేదాలు మాకు అవసరం నాన్సెన్సు అని శబ్ద కాలుష్యమని ఇలా వినలేని కఠినపు మాటలను అంటూ శశిభూషణ శర్మ గారిని అనేక మాటలతో  దూషించాడు ఆ ప్రతినిధి బొమ్మక్ మురళి  ….పాశ్చాత్యులు వేదశబ్దం అవసరమని హిందుత్వం వైపు అడుగులువేస్తువుంటే బొమ్మక్ మురళి  లాంటి వారు శబ్ద కాలుష్యం అంటున్నారు ….క్రింద ఆడియో క్లిప్ వినండి .

పై విషయం పై అందరు స్పందించాల్సిన అవసరం వుంది

NO COMMENTS

LEAVE A REPLY